వైద్యపరీక్షలు అనంతరం కోర్టులో హాజరు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు స్థానికులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగ చర్ల ఘటనలో మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్రామంలో భూసేకరణ ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు కడా ప్రత్యేక అధికారి, డీఎస్‌పీ తదితరులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నారు. అనంతరం ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు స్థానికులు
ఈ ఘటనలో తమపై పోలీసులు, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని లగచర్ల గిరిజన కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఈ మేరకు కమిషన్‌ను కలవడానికి ఆ గ్రామస్థులు వెళ్లనున్నారని తెలిసింది. తమ కుటుంబ సభ్యుల అరెస్టులు, చోటు చేసుకున్న పరిణామాలపై కమిషన్ కు లగచర్ల వాసులు వివరించనున్నారు.