Tuesday, November 12, 2024

రాయచోటిలో దారుణం.. 7 నెలలుగా మైనర్‌ బాలికపై అత్యాచారం

అన్నమయ్య , ప్రభ న్యూస్‌: బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం ఆనవాయితీగా మారిపోయింది. కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చదువుకునే బాలికలపై మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో చిన్నారుల వద్ద నుంచి మహిళల వరకు అక్కడక్కడ ఇటువంటి అత్యాచారాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా రాయచోటి పట్టణంలో ప్రగతి యూనివర్శిటీ ట్యూషన్‌ నిర్వాహకుడు అభిరామ్‌రెడ్డి పదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతూ, ప్రైవేటుగా ప్రగతి యూనివర్శిటీలో ట్యూషన్‌కి వెళ్తుండేది. అయితే గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు ట్యూషన్‌కి వెళ్తున్న బాలికపై నిర్వాహకుడు అభిరామ్‌రెడ్డి మాయమాటలు చెప్పి అదిక మార్కులు వేయిస్తానని, పదో తరగతిలో పాస్‌ చేయిస్తానని చెప్పి బాలికను లొంగదీసుకున్నట్టు బాధిత కుటుంబసభ్యులు పిర్యాదులో పేర్కొన్నారు.

7 నెలలుగా మూడు సార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు ఎవరికైనా చెబితే నీ జీవితం, భవిష్యత్‌ నాశనం అవుతుందని బెదిరించేవాడని దీంతో భయపడి ఎవరికీ చెప్పలేకపోయానని బాధ్యత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ట్యూషన్‌ నిర్వాహకుడు చేసే ఇటువంటి కార్యక్రమం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేక, జరిగిన విషయం ఎవరికీ చెప్పుకోలేక బాదపడుతూ ఆ బాలిక మానసిక క్షోభ అనుభవించినట్లు తెలుస్తోంది. దీంతో పదో తరగతి పరీక్షలు కూడా సరిగా రాకపోవడం వల్ల రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయినట్లు తెలుస్తుంది. ఫెయిలైన తర్వాత మళ్లి అదే ట్యూషన్‌కు వెళ్తున్న తరుణంలో అనుమానం వచ్‌చన తల్లి కుమార్తెను బాగా చదువుతున్న నువ్వు ఎందుకు ఫెయిల్‌ అయినావు అని అడగ్గా ఇపుడు జరిగిన విషయం ఆ బాలిక తల్లికి చెప్పింది. వెంటనే బాధిత కుటుంబసభ్యులు రాయచోటి అర్బన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సుధాకర్‌రెడ్డి ట్యూషన్‌ నిర్వాహకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేఇస దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వెలుగులోకి వచ్చిన ఈ దారుణంతో పాటు వెలుగులోకి రాకుండా రహస్యంగానే ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. బాలికలపై, మహిళలపై పాఠశాలల్లో, కళాశాలలో హాస్టళ్లలో, వారు విధులు నిర్వహించే చోట లౖౖెంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా చట్టం మరింత కఠినతరం చేసి అమలు చేస్తే ఇటువంటి దారుణాలకు ఫుల్‌స్టాప్‌ పడే పరిస్థితి కనపడటం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement