ఆ చిన్నారికి మూడున్నరేళ్లు..కంటికి రెప్పలా కాపాడాల్సిన వయసు చిన్నారిది. ఈ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు స్కూల్ బస్ డ్రైవర్. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ బస్సులోనే ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధిని శరీరంపై పెనుగులాడిన గుర్తులను చూసి తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా ఆరోపణలను తోసిపుచ్చింది. ఆపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడికి సాయపడిన మహిళ సహాయకురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై బుకాయించిన స్కూల్ అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని దోషులుగా తేలితే వారిపైనా చర్యలు చేపడతామని వెల్లడించారు.
స్కూల్ బస్సులో దారుణం-మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి- ఇద్దరి అరెస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement