Tuesday, November 19, 2024

యూపీలో దారుణం : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హ‌త్య

ఓకే కుటుంబంలో ఐదుగురు దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రయాగ్​రాజ్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దుండగులు హత్య చేశారు. మృతుల్లో 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. నవబ్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఉన్న ఖగల్‌పూర్ గ్రామానికి చెందిన రాహుల్ (42), అతడి భార్య ప్రీతి (38), వారి కుమార్తెలు మహి (15), పిహు (13), కుహు (11) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ అగర్వాల్ తెలిపారు. విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్​ను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. భాజపా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. నేరాలు బాగా పెరిగాయని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement