Thursday, January 16, 2025

Karnataka : ప‌ట్ట‌ప‌గలే ఏటీఎం క్యాష్ వ్యాన్ దోపిడీ

  • వ్యాన్ సిబ్బందిపై ఆగంత‌కుల కాల్పులు
  • ఒక‌రు స్పాట్ లో, మ‌రొక‌రు హాస్పిట‌ల్లో మృతి
  • వ్యాన్ లోని డ‌బ్బు తీసుకుని బైక్ పై దుండ‌గులు ప‌రారీ


బీదర్: కర్ణాటకలోని బీదర్ లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. గాయ‌ప‌డిన‌ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఇక కాల్పులు జ‌రిపిన‌ దుండగులు ఏటీఎం వ్యాన్ లో ఉన్నసొమ్మును చేజిక్కించుకుని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బీద‌ర్ ప‌ట్టణంలోని పలు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అన్ని రకాలు వాహ‌నాల‌ను త‌నిఖీలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement