ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాష్ట్ర జలవనరుల, విద్యాశాఖా మంత్రి అతిశి మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ నిర్వహించిన పార్టీ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సీఎం పదవి కోసం అతిశీ పేరును నామినేటే చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డులకెక్కనున్నారు.
ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే మద్యం కుభంకోణంలో అరెస్టై ఈ మధ్యనే జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన కేజ్రీవాల్.. తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎవరనే ప్రశ్న తెరపైకొచ్చింది. అయితే తాజాగా అతిశీని సీఎంగా నియమించబోతున్నట్లు కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవడంతో ఆ టెన్షన్‌కు తెరపడింది.
- Advertisement -