Friday, November 22, 2024

ఏషియన్‌ అథ్లెట్స్‌లో సత్తా చాటుతున్న‌ క్రీడాకారులు.. ఇప్పటివరకు 9 పతకాలను సోంతం చేసుకున్న‌ భారత్‌

ఏషియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో భారత క్రీడాకారులు సత్తాను చాటుతున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్న క్రీడాకారులు ఇప్పటివరకు 9 మెడల్స్‌ను సాధించి పతకాల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం అథ్లెట్స్‌ జాబితాలో ఐదు స్వర్ణాలు, ఒక వెండి, మూడు రజత పతకాలు సాధించారు. మూడోరోజు గురువారం జరిగిన వందమీటర్ల హర్డిల్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజిస్వర్ణం స్వర్ణం సాధించింది.

జ్యోతి యర్రాజి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నానికి చెందిన తెలుగు క్రీడాకారిణి. జ్యోతి విజయంతో భారత పట్టికలో ఐదు స్వర్ణాలు చేరాయి. బెస్ట్‌ త్రోలో తాజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ బెస్ట్‌ రెండవ ప్రయత్నంలో 19.80 మీటర్ల నుంచి 20.23 మీటర్లు త్రో చేసి స్వర్ణాన్ని సాధించాడు. తాజిందర్‌ పాల్‌ ఇప్పటివరకు ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. ఆడిన ప్రతిసారి స్వర్ణం సాధిస్తూ వస్తున్నాడు.

- Advertisement -

ఇదే ఆటలో ఇరాన్‌కు చెంది మెహదీ శబరీ సిల్వర్‌ సాధించగా, కజకిస్థాన్‌కు చెందిన ఇనావ్‌ రజతం సాధించాడు. అయితే తాజిందర్‌ కాలికి గాయం కారణంగా నాల్గవ విభాగంలో ఆడలేక పోయారు. 300 మీటర్ల పరుగులో భారత్‌కు చెందిన పారల్‌చౌదరి మొదటిసారిగా స్వర్ణం సాధించింది. 28 సంవత్సరాల చౌదరి 500 మీటర్ల పరుగులో 2019లో రజతం గెలుపొందింది. 9.38.76 నిమిషాల వ్యవధిలో తన లక్ష్యాన్ని చేధించి, స్వర్ణం సాధించింది. ఇంకా రెండు రోజుల పాటు జరుగనున్న ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మరిన్ని పతకాలు భారత్‌ ఖాతాలో చేరే అవకాశ ముంది. పతకాలు సాధించిన వివరాలు

జ్యోతి యర్రాజి 100 మీటర్స్‌ హర్డిల్‌ స్వర్ణం
అబ్దుల్‌ అబుబకర్‌ మెన్స్‌ ట్రిపుల్‌ జంప్‌ స్వర్ణం
పారల్‌ చౌదరి 300 మీటర్లు పరుగు స్వర్ణం
అజయ్‌ కుమార్‌ సరోజ్‌ 1500 మీటర్ల పరుగు స్వర్ణం
తేజేందర్‌సింగ్‌ పాల్‌ తూర్‌ మెన్స్‌ షాట్‌ఫుట్‌ స్వర్ణం
శైలిసింగ్‌ ఉమెన్స్‌ లాంగ్‌జంప్‌ వెండి
అభిషేక్‌ పాల్‌ 10వేల మీటర్లు రజతం
ఐశ్వర్య కైలాస్‌ మిశ్రా ఉమెన్‌ 400 మీటర్లు రజతం
తేజశ్విన్‌ శంకర్‌ మెన్స్‌ డెకథ్లాన్‌ రజతం

Advertisement

తాజా వార్తలు

Advertisement