Tuesday, November 26, 2024

లిక్క‌ర్ స్కామ్ బిజెపి సృష్టి – దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌న్న అప్ మంత్రి అతిషి

ఢిల్లీ – లిక్కిర్ స్కామ్ కేసు బిజెపి సృష్టేనంటూ ఆప్ ముఖ్య‌నేత , మంత్రి అతిషి ఆరోపించారు.. ఈ కేసులో ఈ డి అరెస్ట్ చేసిన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్బంగా వారిద్ద‌రూ రూ 100 కోట్లు స్వీక‌రించార‌న‌డానికి ఈడి ఎటువంటి ఆధారాలు చూప‌లేక‌పోయిందంటూ కోర్టు వ్యాఖ్యానించింది.. దీనిపై అతిషి మాట్లాడుతూ, గడచిన ఏడాదిగా బిజెపి నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. బిజెపి నేతల ఆరోపణలే సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్ లో వచ్చాయ‌ని పేర్కొన్నారు.. 6 నెలలకు పైగా సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. రెండు ఏజెన్సీలకు చెందిన 500 కు పైగా అధికారులు దర్యాప్తు లో భాగ‌స్వాములుగా ఉన్నార‌న్నారు.. ప్ర‌ధానంగా రూ.100 కోట్ల కిక్ బ్యాక్ లు పొందారని ఆరోపణలు చేస్తూ ద‌ర్యాప్తు కొన‌సాగించారని అతిషి పేర్కొన్నారు.

ఈ వంద కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని పదే.. పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పార‌న్నారు.. ఈ కేసులో ఈడీ ఎటువంటి ఆధారాలు చూప‌క‌పోవ‌డంతో రౌజ్ ఎవెన్యూ కోర్టు రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా కు బెయిల్ ఇచ్చింద‌ని గుర్తు చేశారు.. బెయిల్ తీర్పు పై ఇచ్చిన 85పేజీల ఆర్డర్ బిజెపి నేతలు చదివి ఉంటారని అనుకుంటున్నాన‌ని చెప్పారు..
ఒక్క పైసా కు సంబంధించి సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలు లేవని కోర్ట్ చెప్పిందని, ఇది బిజెపి నేత‌లు గుర్తించాల‌ని కోరారు.. వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనిచ .. కిక్ బ్యాగ్ లు ఇచ్చారని బిజెపి ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చింద‌న్నారు.. లంచం, కిక్ బ్యాగ్ చెల్లింపులకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్పింద‌ని ఆమె పేర్కొన్నారు. సాక్షులు చెప్పిన దాని ప్రకారం చెల్లింపులు జరిగినట్లు పరిగణించలేమని కోర్ట్ చెప్పింద‌న్నారు..

అసలు ముందు చెప్పిన 100 కోట్ల కిక్ బ్యాగ్ లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేద‌ని, ఆ త‌ర్వాత వంద కోట్ల లంచం ఇప్పుడు 30 కోట్లు అంటున్నార‌న్నారు.. క‌నీసం వాటికి కూడా ఆధారాలు లేవ‌ని కోర్టు స్ప‌ష్టం చేసిన విష‌యం బిజెపి గుర్తించాల‌న్నారు.
రాజేష్ జోషి ద్వారా రూ.30 కోట్లు ఢిల్లీకి వచ్చాయి అలాగే గోవాకు వెళ్లాయని ఆరోపించారు. వారి దగ్గర వీరి నంబర్ ఉంది… వీరి దగ్గర వారి నెంబర్ ఉంది కాల్స్ చేసుకున్నారు.. ఇలాంటి అంశాలు ఆధారాలుగా పరిగణించలేమని కోర్ట్ తెలిపింది. డిజిటల్ గా కానీ హవాలా ఆపరేటర్ వద్ద కానీ డబ్బు తరలించినట్లు ఆధారాలు సమర్పించలేదన్న న్యాయస్థానం. స్వతంత్ర ఆధారాలు ఏవి దర్యాప్తు సంస్థ సేకరించలేదని కోర్టు చెప్పింది. గడచిన 6 నెలలు గా ఈడీ, సీబీఐ అధికారులు గోవాలో తిష్ట వేసింది. గోవాలో ఆమాద్మీ పార్టీకి పనిచేసిన వెండర్స్ వద్ద తనిఖీలు, విచారణ చేశారు. చివరికి గోవా ఎన్నికల్లో ఆప్ రూ.19లక్షలు నగదు ఖర్చు చేసిందని చెప్పారు. ఆప్ అత్యంత నిజాయితీ పార్టీ అని దర్యాప్తు సంస్థల తేల్చేసాయి. అల్లరి అల్లరి చేస్తున్న బిజెపి నేతలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. అంటూ అతిషి డిమాండ్ చేశారు.. ఛార్జ్ షీట్ లు సీబీఐ, ఈడీ రాయడం లేదు. ప్రధాన మంత్రి కార్యాలయంలో సిద్ధం చేస్తున్నార‌ని అతిషి ఆరోపించారు…

వారు రాసినదానికి ఆధారాలు సేకరించమని అధికారులపై వత్తిడి చేస్తున్నార‌ని అన్నారు. దర్యాప్తులో అధికారులు తమపై దాడులు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు చెపుతున్నార‌ని గుర్తు చేశారు. ఏ ఆధారాలతో ఫోన్లు ధ్వంసం చేసారని అధికారులు ముందే చెబుతున్నార‌ని అతిషి నిల‌దీశారు. అబద్ధపు ఆధారాలను సృష్టిస్తున్నార‌న్నారు.. సంజయ్ సింగ్ పేరు పేర్కొన్నారు… అయ‌న లీగల్ నోటీసు పంపగానే తప్పు జరిగిందని క్షమాపణ కోరార‌న్నారు… మద్యం కుంభకోణంలో వస్తున్న పేర్లు అన్ని అవాస్తవాల‌ని,.. అసలు కుంభకోణం జరగలేద‌ని అతిషి స్ప‌ష్టం చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆప్ పార్టీని బద్నాం చేయ‌డం కోసమే ఈ కేసు బిజెపి సృష్టించిదంటూ ఆమె మండిప‌డ్డారు..క‌నీసం మనీష్ సిసోడియా కు వ్యతిరేకంగా కూడా ఆధారాలు సమర్పించలేదంటూ ఈ కేసు విష‌యంలో
ప్రధాని, బిజెపి నేతలు దేశ ప్రజల క్షమాపణ చెప్పాలంటూ కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement