Thursday, November 21, 2024

ఫేమ‌స్ కావాల‌నే అతీక్ ను హ‌త మార్చాం….నిందితుల వాగ్మూలం

ప్రయాగ్‌రాజ్‌, ఉత్తరప్రదేశ్‌: దేశవ్యాప్తంగా శనివారం సంచలనం సృష్టించిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీఖ్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌ హత్యల కేసులో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆదివారం చెప్పినదాన్ని బట్టి హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు పక్కాగా వేసుకున్న పథకం ప్రకారం జర్నలిస్టుల తరహాలో నకిలీ గుర్తింపు కార్డులు, ఒక కెమెరాతో రంగంలోకి దిగారు. హత్యలకు పాల్పడిన అనంతరం పోలీసులు అదుపు లోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను లవ్‌లేష్‌ తివారీ, సన్నీ, అరుణ్‌ మౌర్యలుగా గుర్తించారు. అండర్‌వరల్డ్‌ సామ్రాజ్యం లో పేరు, ప్రఖ్యాతులను పొందడం కోసం అతీఖ్‌ అహ్మద్‌ను హతమార్చాలని తాము ఆశించినట్టు విచారణ సందర్భంగా ముగ్గురు నిందితులు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపా యి. వారు గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఒక లాడ్జీలో బస చేశారు. ప్రస్తుతం పోలీసులు సదరు మేనేజర్‌ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. పోలీస్‌ కస్టడీలో ఉన్న అతీఖ్‌, అతడి సోదరుడు అష్రఫ్‌లను వౖౖెద్య పరీక్షల నిమిత్తం ఒక ఆసుపత్రికి తీసుకువస్తారనే విషయాన్ని తాము తెలుసుకున్న ట్టు పోలీసులతో వారు చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడిం చాయి. జర్నలిస్టులగా వ్యవహరిస్తే అతీఖ్‌కు అత్యంత సన్నిహ తంగా చేరుకోవచ్చునని వారు భావించారు. ఇతర జర్నలిస్టు లతో కలిసి శనివారం రోజంతా కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను అనుసరిస్తూనే ఉన్నారు.

ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి రాత్రి దాదాపు 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో మోతీలాల్‌ నెహ్రూ డివిజనల్‌ ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రత మధ్య చేతులకు సంకెళ్ళతో గేటు నుంచి లోపలకు వస్తున్న అతీఖ్‌, అష్రఫ్‌ల సమీపానికి ముగ్గురు నిందితులు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న జర్నలిస్టుల్లో జర్నలిస్టుల్లా వారు కలిసిపో యారు. వారిలో అరుణ్‌ మౌర్య తన దగ్గర ఉన్న తుపాకీతో అతీఖ్‌ తలపైన మొదటి తూటాను పేల్చాడు. ముగ్గురు నిందితులు 20 రౌండ్లకు పైగా తూటాలను సోదరులపై కాల్చారు. పోలీసులు ఒక్క తూటాను కూడా పేల్చలేదు. నిందితులు అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో అతీఖ్‌, అష్రఫ్‌ అక్కడిక్క క్కడే మరణించారు. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు పోలీసులకు లొంగి పోయారు. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు నకిలీ మీడియా గుర్తింపు కార్డులను, ఒక మైక్రోఫోన్‌ను, ఒక కెమెరాను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాలికి తూటా తగలడంతో గాయపడిన లవ్‌లేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. అతీఖ్‌, అష్రఫ్‌ల గ్యాంగ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేసి, అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యం లో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడమే లక్ష్యంగా వారిద్దరిని హతమార్చాలని తాము నిర్ణయించినట్టు ముగ్గు రు నిందితులు చెప్పారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement