టాటా గ్రూప్ దేశీయంగా ఐఫోన్ల తయారు చేయనుంది. ఐఫోన్లు తయారు చేసే మొదటి ఇండియన్ కంపెనీగా టాటా గ్రూప్ నిలువనుంది. త్వరలోనే టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయనుంది. ఐఫోన్లను దేశీయ మార్కెట్‌తో పాటు, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా శుక్రవారం నాడు అధికారికంగా ప్రకటించారు.
తైవాన్ సంస్థ విస్ట్రాన్‌కు చెందిన కర్నాటక ప్లాంట్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ గ్రూప్‌ను కొనుగోలు చేసినందుకు, ఐఫోన్ల తయారీని చేపట్టినందుకు ఆయన టాటా గ్రూప్‌కు అభినందనలు తెలిపారు. విస్ట్రన్ గ్రూప్ దేశానికి అందించన సేవలను కూడా మంత్రి అభినందించారు.
యాపిల్ కంపెనీ ఇండియా నుంచి గ్లోబల్ సప్లయ్ చైన్‌ను ప్రారంభించనుందని ఆయన తెలిపారు. టాటా ఎలక్ట్రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్)తో విఎ్టాన్ ఇన్ఫోకామ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 100 శాతం వాటాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు విస్ట్రన్ బోర్డు, విస్ట్రన్ అనుబంధంగా ఉన్న ఎస్‌ఎంఎస్ ఇన్ఫోకామ్ (సింగపూర్), విస్ట్రన్ హాంకాంగ్ లిమిటెడ్‌లు ఆమోదించాయి.
ఈ డీల్ విలువ సుమారుగా 125 మిలియన్ డాలర్లుగా ఉంది. కర్నాకలోని విస్ట్రన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో తీసుకు వచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) స్కీమ్ వల్ల మన దేశం స్మార్ట్ ఫోన్ల తయారీ కేంద్రంగా, ఎగుమతులకు విశ్వసనీయ కేంద్రంగా మారిందని మంత్రి చంద్రశేఖరన్ తెలిపారు.
తాజాగా టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలో ఐఫోన్ల తయారు చేయడంతో పాటు, ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన ట్విట్ చేశారు. దేశంలో గ్లోబల్ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం విస్ట్రాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 14 మోడల్‌ను అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో 10 వేల మంది పని చేస్తున్నారరు.
ప్రభుత్వం ఇస్తున్న పీఎల్‌ఐ పథకం కింద ఇస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని 2014 మార్చి నాటికి 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నాటికి ఉద్యోగుల సంఖ్యను కూడా మూడు రెట్టు పెంచుకోవాలని విస్ట్రాన్ నిర్ణయించింది. టాటా గ్రూప్ ఈ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసినందున ఈ లక్ష్యాలను నెరవేర్చనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.