- ఏకంగా రూ.4, 500 కోట్ల పథకాలు కానుక
- ఢిల్లీలో ఎన్నిలకు శంఖారావం పూరించిన ప్రధాని
న్యూ ఢిల్లీ – ఢిల్లీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రధాని మోడీ నేడు పూరించారు.. ముందుగా ఆయన ఢిల్లీలోని అశోక్ నగర్ లో ర్యాలీ నిర్వహించారు.. అనంతరం ఆయన ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు రూ.4,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసారు.
‘అందరికీ హౌసింగ్’ ప్రతిజ్ఞలో భాగంగా, ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్‌లను ప్రధాని సందర్శించారు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో మురికివాడల కోసం కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్‌లను ప్రధాని మోడీ ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు స్వాభిమాన్ అపార్ట్‌మెంట్ల తాళాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీ ప్రజలకు మెరుగైన అవకాశాలు, నాణ్యమైన జీవితాన్ని అందించాలనే తమ అచంచలమైన నిబద్ధత ఈ రోజు ప్రారంభించబడుతున్న ప్రాజెక్టుల్లో ప్రతిబింబిస్తుందన్నారు. వికసిత్ భారత్ తొలి అడుగులు ఢిల్లీ నుంచే ప్రారంభించామన్నారు. ఢిల్లీ ప్రజలకు మంచి చేయాలనే అనేక సంక్షేమ పథకాలను తాము ప్రవేశపెట్టామన్నారు. కేవలం డబ్బులు ఇవ్వడమే గొప్ప పథకాలుగా ఆప్ చెప్పుకుంటున్నదని విమర్శించారు. వారి పథకాలకు ఖర్చు చేస్తున్న సోమ్ము ఢిల్లీ ప్రజలవేనన్నారు. సంక్షేమం పేరుతో అభివృధ్దిని ఢిల్లీకి దూరం చేస్తున్న ఆప్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగు ఓడించాలని పిలుపునిచ్చారు మోడీ.