తాను అనాథని తండ్రి ఉన్నా లేనట్టేనని తెలిపింది జబర్థస్త్ యాంకర్ సౌమ్యరావు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను మెప్పిస్తున్న జబర్దస్త్ షో కి పదుల సంఖ్యలో హాస్యనటులు వస్తున్నారు. అందులో యాంకర్లు, జడ్జిలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోని కొత్తగా జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చిన సౌమ్యరావు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ లో సందడి చేసిన సౌమ్యరావు ఇప్పుడు మూడవ ఎపిసోడ్కి కూడా సిద్ధం అవుతోంది. ఆమెకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది .
తాను అందరూ ఉండి కూడా అనాథనని తెలిపి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈమె కష్టాలు చూసి ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కి పోయింది. ఇటీవల ఈటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సౌమ్యరావు పాల్గొంది . ఆ షో లో యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ .. మీ గురించి ఏదైనా చెప్పండి అని అడగ్గా.. తాను తన లైఫ్ గురించి చెప్పింది.. సౌమ్య రావు మాట్లాడుతూ..” నా లైఫ్ గురించి ఏం చెప్పను .. నాకు అమ్మ లేదు.. నాన్న ఉండి కూడా లేనట్టే.. ప్రస్తుతం నేను ఒక అనాథని.. నాకు ఎవరూ లేరు.. ఇక్కడ ఉన్న వారందరికీ అమ్మనో.. నాన్ననో.. బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు . కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది సౌమ్యరావు.