బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ గతంలో వెల్లడించారు..
‘1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని అక్షయ్ వివరించారు. తాజాగా తనకు భారత్ పౌరసత్వం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు..