నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా..ఈ మూవీ ప్రమోషన్స్ ని విశాఖ క్రికెట్ స్టేడియంలో చేశారు నాని.ఆదివారం వైజాగ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నేచురల్ స్టార్ హీరో నాని లైవ్ లో సందడి చేశారు. నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మార్చ్ 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో దసరా ప్రమోషన్స్ కోసం నాని వైజాగ్ మ్యాచ్ లో మెరిశారు. తనకి క్రికెట్ తో ఉన్న అనుబంధాన్ని కామెంటేటర్స్ పంచుకున్నారు. గ్రౌండ్ లో చాలా సేపు సందడి చేసిన నాని.. కామెంటేటర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు. తాను చివరగా అంటే సుందరానికీ టీంతో కలసి క్రికెట్ ఆడడానని గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైం ఫేవరిట్ అని తెలిపారు. టీమిండియాలో కీలక ప్లేయర్లని తన సినిమాలతో పోల్చాడు. హార్దిక్ పాండ్యని పిల్లజమీందార్ అని అన్నాడు. ఇక రోహిత్ శర్మ జెంటిల్ మాన్ అని.. విరాట్ కోహ్లీ గ్యాంగ్ లీడర్ అంటూ వారికి సూట్ అయ్యే విధంగా నాని చెప్పడం విశేషం.