Tuesday, November 26, 2024

ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండాలకు నంది అవార్డులు ..

సినీ ఇండస్ట్రీలో మరోసారి నంది అవార్డులపై చర్చ మొదలైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను పద్మాలయా స్టూడియో విడుదల చేస్తన్నట్లు అదిశేషగిరిరారు ప్రకటించారు. ఈ సినిమా తీసేందుకు ముఖ్య కారణం ఎన్టీఆర్ స్పూర్తని చెప్పుకొచ్చారు. పద్మాలయా బ్యానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయికి వెళ్లాలనే పద్మాలయా ఏర్పాటు చేసామని వెల్లడించారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు ప్రభుత్వాలకు ఆసక్తి లేదన్నారు. తన ఉద్దేశంలో అసలు అవార్డులకు ప్రాధాన్యత లేదని చెప్పారు. నంది అవార్డుల కంటే సంతోష్ అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు

అలాగూ ఈ రోజున కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు సినిమా విడుదలై 49 సంవత్సరాలు పూర్తయిందని ఆదిశేషగిరి రావు గుర్తు చేసారు. కృష్ణ జన్మదినం నాడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కృష్ణ మెమోరియల్ కోసం ప్రభుత్వం స్థలం ఇస్తామని చెప్పిందని, తమ సొంత స్థలంలోనే మెమోరియల్ గా మ్యూజియమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.తనకు ఇక్కడ కంటే ముంబాయిలో మంచి పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు. కలర్ పరంగా సౌండ్, మ్యూజిక్ పరంగా అన్ని హంగులతో మోసగాళ్లకు మోసగాడు తీర్చి దిద్దామని పేర్కొన్నారు. బుర్రిపాలెంలో సీనియర్ సిటిజిన్ హోం నిర్మిస్తున్నామన్నారు. ఇదివరకు ప్రభుత్వ అవార్డులకు వాల్యూ ఉండేదని, ఇప్పుడు లేదని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు

గతంలో భరద్వాజ్ తెలుగు ప్రభుత్వాలకు మద్దతుగా ఉన్నారంటూ వచ్చిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. తాను ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానో చెబితే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటానంటూ వ్యాఖ్యానించారు. మరో నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు చేసారు.ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు మూడేళ్లలో తిరిగి ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వటం మొదలవుతుందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement