Tuesday, November 26, 2024

నేడు భూమికి చేరువలో రానున్న భారీ గ్రహశకలం

భూమికి అత్యంత సమీపంలోకి గ్రహశకలం రాబోతుంది. భూమి నుండి 1.4మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం తిరగనుంది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో పయణిస్తూ నేడు భూమి సమీపంలోకి వచ్చి వెళ్లనుంది. అయితే బుర్జ్‌ ఖలీఫా పరిమాణంలో ఉన్న ఆ శకలం వల్ల భూ గ్రహానికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘2016ఏజే 193’ అనే గ్రహశకలం నేడు భూమికి దగ్గరగా రానుంది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో పయణిస్తున్న ఆ గ్రహశకలం శనివారం రాత్రి 8.40 గంటల సమయంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అయితే ప్రస్తుతానికి గ్రహశకలం వల్ల భూమిపై నివసిస్తున్న వారికి ఎలాంటి హాని ఉండబోదని వెల్లడించారు. గ్రహశకలానికి, భూమికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. భూమికి, చంద్రుడికి మధ్య దూరంతో పోలిస్తే అది 9 రెట్ల అధిక దూరంలో ఉందని స్పష్టం చేశారు. భూ కక్ష్యలో పయణిస్తున్న ఆ గ్రహశకలం మళ్లీ 2063లో మన గ్రహానికి దగ్గరగా వస్తుందన్ని వెల్లడించారు. 2016 జనవరిలో హవాయ్‌లోని పాన్‌స్టార్స్‌ అబ్జర్వేటరీ సాయంతో ఆ గ్రహశకలాన్ని గుర్తించామన్నారు. నియోవైస్‌ అనే వ్యోమనౌక సాయంతో దానిని పరిశీలించామని తెలిపారు. ఆ గ్రహశకలం 5.9 ఏళ్లకు ఓ సారి సూర్యుడిని చుట్టివస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: ఆ చేప ధర లక్ష రూపాయలు.. చేప ప్రత్యేకత ఏంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement