తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా కల్పిస్తున్నామన్నారు…. అలాగే భూమిలేని రైతు కుటుంబాలకు కూడా రైతు భరోసా కల్పిస్తామన్నారు. ఒక్కో ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, ఫిబ్రవరి నుంచి లబ్దిదారులకు రేషన్ బియ్యం, 200 కొత్త గ్రామపంచాయతీలు, ఇక కేబినెట్ 11 నూతన మండలాలకు ఆమోదం తెలిపిందన్నారు.
పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు… పెండింగ్ లో ఉన్న ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు.. త్వరలోనే గవర్నర్ కు ప్రతిపాదనలు, వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసినట్టు వెల్లడించారు.