ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
పోస్ట్‌లు, అర్హతల వివరాల కోసం https://dme.ap.nic.in లేదా https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 23-08-2024 నుండి 09-09-2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.