పరిశ్రమలు ప్రారంభించని ల్యాండ్స్ పై బిజెపి సభ్యుడి ప్రశ్న
పరిశ్రమల వ్యర్థాలతో మత్య్స సంపదకు ప్రమాదం
కంపెనీలపై చర్యలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పట్టు
ఆ పరిశ్రమల భూములు వెనక్కి తీసుకుంటామన్న మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్ – పరిశ్రమల వ్యర్థాలతో చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయని, ఆ పరిశ్రమలకు ఇచ్చిన భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో చెప్పాలని అసెంబ్లీలో ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. ప్రొడక్షన్ ప్రారంభించని పరిశ్రమల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల భూములు వెనక్కి తీసుకుంటామన్నారు . అలాగే భూములను మిస్ యూస్ చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమలపై ఫిబ్రవరి వరకు కమిటీ నివేదిక ఇస్తుందన్నారు తెలంగాణలో35 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల కాలుష్యాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయడం లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. పీసీబీ రూల్స్ ప్రకారం కాలుష్యంపై చర్యలు ఉంటాయన్నారు. పారిశ్రామిక పార్కుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు దుద్దిళ్ల.
రెండు వర్శిటీలు… క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకు..
ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన ఓవైసీ మాట్లాడుతూ, జేఎన్టీయూ, ఓయూ వర్సిటీల్లో క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకని ప్రశ్నించారు. ఆ రెండు వర్సిటీల్లో సిలబస్ సేమ్ ఉన్నాయన్నారు. జేఎన్టీయూ, ఓయూల్లో క్రిడెట్ పాయింట్లలో ఏకరూపత తేవాలన్నారు. డిటేయిన్ అయిన స్టూడెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరమయ్యారని చెప్పారు. విద్యార్థులను డీటేయిన్ చేస్తే ఆరేళ్లలో ఇంజనీరింగ్ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే క్రెడిట్స్,డిటెన్షన్ పై సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. మేనేజ్ మెంట్స్ వర్సిటీ వీసీలతో స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.