Tuesday, November 26, 2024

Assembly – అసెంబ్లీలో మాటల యుద్దం …రేవంత్ – కెటిఆర్ ఢీ

అసెంబ్లీ మాట‌ల యుద్దానికి వేదికైంది.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్యవాదాలు తెలిపే అంశంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంలో అధికార‌, ప‌క్షాల మ‌ధ్య వాదోప‌వాదాలు , ఘాటు వ్యాఖ్యాలతో హాట్ హాట్ గా సాగింది.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు… అనంతరం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ సభలో మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని ఆరోపించారు.ఘనత వహించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది? అని సభలో ప్రశ్నించారు. ఆకలి కేకలు, పడవు పడ్డ బావులు అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదన్నారు. నల్గొండ లో ఫ్లోరైడ్ బాధలు, దేవర కొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు జరగాయన్నారు. కొడంగల్ నుంచి బొంబాయి కు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో అన్నారు. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవన్నారు. తెలంగాణ పదం నిషేధిస్తే… ఒక్క కాంగ్రెస్ నేత మాట్లాడలేదన్నారు. పదవుల కోసం… పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ నేతలదే అని తెలిపారు.

మాటి మాటికి మంత్రి ఎందుకు మాట్లాడతారా ? అని ప్రశ్నించారు. భట్టి కూడా ఇంత ఆవేశం పడితే ఎలా? అని ప్రశ్నించారు. వలసలు వాస్తవం.. నెత్తురు పారిన నేల వాస్తవం అన్నారు. 2014 జూన్ లో రేవంత్ మాట్లాడిన మాటలు అన్నారు. మా తండ్రి చనిపోతే దహన సంస్కారం తర్వాత.. స్నానం చేద్దాం అంటే.. కరెంట్ లేదన్నారు. ఇది రేవంత్ మాట్లాడిన మాట అన్నారు. ఇందిరమ్మ పాలన గురించి గుర్తు చేయాలి కదా? అన్నారు. పోతిరెడ్డిపాడు గురించి చెప్పాలన్నారు. ఇందిరమ్మ పెరు అవసరం కోసం వాడతాం అంటే ఎలా? అని ప్రశ్నించారు. తెలంగాణకి కలిసి వచ్చే సమయానికి నడిసి వచ్చే కొడుకు కేసీఆర్ అన్నారు. జూన్ 2 ..2014 లోనే నిర్బంధం పోయిందన్నారు. బానిసకోక బానిస అన్నట్టు.. పీడించిన వాళ్ళ కి వారసులు వాళ్ళు.. 1.5 శాతం ఓటు తేడా మాత్రమే అన్నారు. మిడిసి పడొద్దు ఎక్కువ తేడా లేదన్నారు.

ముందు చ‌రిత్ర వ‌ద్దు…2014 త‌ర్వాత విష‌య‌మే మాట్లాడ‌దాం…భ‌ట్టి


దీనిపై డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ భట్టి విక్రమార్క సభలో ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాటలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుని అని పెద్ద మనసుతో చెప్పామన్నారు. దాడి చేయడం మొదలు పెట్టారు.. .కేటీఆర్ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎందుకు నీళ్ళు లేవు…వివరాలు చెప్పా మంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జనం నీరు తాగలేదా ? అని తెలిపారు. యాభై ఏండ్లలో ఏం చేశారు అంటారన్నారు. 55 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర ము వద్దనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది లెక్క అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు.
సంపద తో మేము ఇస్తే.. అప్పుల పాలు చేశారన్నారు. అప్పుల రాష్ట్రం గా మార్చింది మీరు అంటూ మండిపడ్డారు. బాగు చేయాల్సింది పోయి..అప్పుల పాలు చేశారన్నారు. పాత ముచ్చటే మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు వృధా చేశారన్నారు. అదనంగా నీళ్లు ఇచ్చారా మీరు అని తెలిపారు. పదేళ్లు విద్వాంసం చేశారన్నారు. స్వేచ్ఛ లేకుండా చేశారు మీరన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే ఎలా ? అన్నారు.

ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే.. నువ్వు కూడా ఆటే పో.. ఇక్కడ ఎందుకు మరి అంటూ భట్టి ఫైర్ అయ్యారు. ఇక సభలో మరోవైపు కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామంటూ సెటైర్ వేశారు. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలన్నారు. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలన్నారు.

- Advertisement -

కెసిఆర్ కు మంత్రి ప‌ద‌వే ఇచ్చింది మేమే – రేవంత్ రెడ్డి ..

కెటిఆర్ ప్ర‌సంగంలో కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కెసిఆర్ చెప్పారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షమేనన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని.. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ది అని చెప్పారు.

దీనిసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ”కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్ నేతలే. కేసీఆర్కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్రెడ్డి” అని చెప్పారు. కెసిఆర్ ప్ర‌స్థానం ప్రారంభ‌మైందే కాంగ్రెస్ లోనేని రేవంత్
ప్ర‌స్తావించారు.. పోతిరెడ్డిపై పోరాడింది కాంగ్రెస్ న‌ని, ఆ స‌మ‌యంలో అనాటి టి ఆర్ ఎస్ నేత‌ల ఎక్క‌డ అంటూ నిల‌దీశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement