Saturday, January 4, 2025

Assembly – సింపుల్ లివింగ్ … హై థింకింగ్ మ‌న్మోహ‌న్ సింగ్ స్వంతం – కెటిఆర్

భార‌త ర‌త్న‌కు ఆయ‌న అన్ని విధాల అర్హుడు
తెలంగాణ ఇచ్చిన బహుముఖ ప్ర‌జ్ఞాశాలి
ఆయ‌న కేబినేట్ లో కెసిఆర్ ప‌ని చేయ‌డం అదృష్టం
పివి వెలికి తీసిన భార‌త వ‌జ్రం ఆయ‌న
అసెంబ్లీలో ఘ‌నంగా నివాళి అర్పించిన కెటిఆర్

హైద‌రాబాద్ – భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీ లో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఇక మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని కేటీఆర్ అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ హాయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. మ‌న్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ను కేసీఆర్‌ కోరారని గుర్తుచేశారు.

- Advertisement -

ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు. ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. సింపుల్ లివింగ్ … హై థింకింగ్ ఉన్న ఏకైక రాజ‌కీయ దురంధరుడు మ‌న్మోహ‌న్ అంటూ ప్ర‌శంసించారు.


.

Advertisement

తాజా వార్తలు

Advertisement