Wednesday, September 25, 2024

Assembly Elections – జమ్ము కశ్మీర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది..

ఓటు వేసేందుకు మహిళలు ,యువత, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాంతో ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసినా పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి.

కాగా జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న తొలి విడత పోలింగ్‌ పూర్తయ్యింది. తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఇవాళ రెండో విడత పోలింగ్‌ జరుగుతోంది. రెండో విడతలో 26 స్థానాలకు నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్‌ 1న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement