Wednesday, January 15, 2025

Assembly Election – న్యూఢిల్లీ స్థానానికి అర‌వింద్ కేజ్రీవాల్ నామినేష‌న్

కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
అనంత‌రం రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ
ఫిబ్ర‌వ‌రి అయిదో తేదిన అసెంబ్లీ ఎన్నిక‌లు
ఎనిమిదో తేదిన ఎన్నిక‌ల ఫ‌లితాలు.

న్యూఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్ననేప‌థ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ నేడు త‌న నామినేషన్‌ దాఖలు చేశారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న నేటి ఉద‌యం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్‌ ప్రాంతంలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్‌ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. క‌ల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ సీఎం అతిశీ మంగ‌ళవారం నాడు నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement