Tuesday, November 26, 2024

Assembly – అరుణాచ‌ల్‌లో బీజేపీ బోణీ! అయిదు అసెంబ్లీ స్థానాలు ఏక‌గ్రీవం

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నిన్న‌టితో నామినేష‌న్ దాఖ‌లు ప్ర‌క్రియ ముగిసింది. ఈ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క బీజేపీ అభ్య‌ర్ధులు మిన‌హా.. ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఈసీ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ‌

అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏక‌గ్రీవ ఎన్నిక‌పై ఒక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement