Friday, November 22, 2024

Big Breaking | ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం.. సీఎం కేసీఆర్​ చిత్రపటాలకు పాలాభిషేకాలు

టీఎస్​ ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఇవ్వాల (ఆదివారం) అసెంబ్లీ ఆమోదించింది.తొలుత  సీఎం కేసీఆర్, కేబినెట్ తీసుకున్న​ నిర్ణయాన్ని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు పంపగా ఆ బిల్లుపై పలు సందేహాలు లెవనెత్తారు . దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. చివరగా రాజ్​ భవన్​ ముట్టడిస్తామని ప్రకటించారు. అయినా గవర్నర్​ బిల్లును పాస్​ చేయడంలో ఆలస్యం చేయడంతో కార్మికులు ఆవెదనకు గురయ్యారు. కార్మిక సంఘాల ఆందోళనల పిలుపుతో దిగివచ్చిన గవర్నర్​ ఇవ్వాల బిల్లుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. దీంతో ఆ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో అటు ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్​ చిత్ర పటాలకు పలు జిల్లాల్లోపాలాభిషేకాలు చేస్తున్నారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా..

అంతేకాకుండా.. బాన్సువాడ మున్సిపల్ లోని కొయ్యగుట్ట, ఆలేరు మున్సిపాలిటిలోని సాయిగూడెం గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

- Advertisement -

గద్దర్​ మృతి తీరని లోటు..

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్​ ప్రజా గాయకుడు, విప్లవ నేత గద్దర్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు సాహిత్య లోకానికి తీరనదన్నారు. గద్దర్​ మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్ట స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement