Monday, November 25, 2024

భ‌విష్య‌త్ బిందాస్ – అద‌నంగా 34 అసెంబ్లీ సీట్లు..

హైదరాబాద్‌, : తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరుగు తుందా? దీనిపై ఢిల్లి లో కదలికలున్నాయా? 2026 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల డీలిమిటేషన్‌పై ఆశలు వదిలేసుకున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుండి వచ్చిన మాట అనేకమంది నేతలను ఉత్సాహపరుస్తోంది. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో డీ లిమిటేషన్‌ అంశాన్ని ప్రస్తావించడం, సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని చెబుతూ.. మరో 34మందికి కొత్తగా అవకాశా లొస్తాయని, డీ లిమిటేషన్‌ జరుగుతుందని చెప్పడంతో ఆశావహులు దీనికి సంబంధించిన లెక్కల్లో మునిగిపోయారు. వివరాలు ఆరాతీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఒక్కో పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాల చొప్పున మొత్తం 17 స్థానాల్లో 34 అసెంబ్లిd స్థానాలు పెంచాలని 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే గత ఆరున్నరేళ్ళుగా అనేకసార్లు చర్చకు వచ్చినా.. ఇది ముందుకు కదల్లేదు. పార్లమెంట్‌లో పలుమార్లు ఎంపీలు ప్రస్తావించినా, తెలుగురాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పునర్విభజన చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని పలుమార్లు చెప్పారు. 2009 ఎన్నికలు కొత్త ని యాజకవర్గాలతో జరగ్గా.. మళ్ళీ 2026లో పునర్వి భజ న ప్రక్రియ చేపట్టాలని ఆ సమయంలో నిర్ణయిం చా రు. రెండు తెలుగురాష్ట్రాలకు రాజకీయ సుస్థిర త కో సం సీట్లపెంపు అనివార్యమని ఆ చట్టంలో పేర్కొ న్నారు.
కదలిక షురూ
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేడె క్కగా.. భారతీయజనతాపార్టీ పుంజుకుందన్న ప్రచా రాల నేపథ్యంలో అనేకఅస్త్రాలు వెలికితీస్తున్న కేంద్రం తాజాగా పునర్విభజన అంశంపై కూడా దృష్టిపెట్టిం దని టీఆర్‌ఎస్‌ వర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు. జడ్పీఛైర్మన్లతో భేటీ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించడంతో కొత్త నియోజకవర్గాలపై నేతలు ఆశ లు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు ఎమ్మె ల్యే స్థాయి నేతలుండగా.. అభ్యర్ధిత్వాల కోసం తీవ్రపోటీ నెలకొంది.
పలువురు ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీల‌ స్థానం ఖర్చీఫ్‌లు వేసి పెట్టుకోగా, పలుచోట్ల ఎమ్మె ల్యేలతో గొడవులు కూడా పెట్టుకుంటున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ వ్యూహత్మకంగా ఈ అంశాన్ని ప్రసా ్తవించారా లేక.. నిజంగా కదలికలున్నాయా అని పలు వురు నేతలు తమకు ఉన్న సంబంధాలతో ఢిల్లిdవర్గా లను కూడా ఆరా తీసేపనిలో పడ్డారు. కేంద్రం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ.. ముందస్తు ఉప్పు లే కుండా అనూహ్యంగా ప్రవేశపెడుతుండడంతో ఏమై నా జరగొచ్చు అని మరికొందరు నేతలు భావిసు ్తన్నా రు. ముఖ్యమంత్రి నోట వెలువడ్డ మాట ఆశావ హు ల్లో, పదవుల కోసం విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న నేతలకు వరమైంది.
ఎస్సీ, ఎస్టీలకు పెరగనున్న సీట్లు
నియోజకవర్గాల పెంపు జరిగితే మొత్తం సీట్లతో పాటు జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీల సీట్లు పెరగ నున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 2001 లెక్కల ఆధారంగా 15.44 ఉండగా, దామాషా ప్రకారం ఎస్సీలకు 24సీట్లు కేటాయించనున్నారు. తెలంగాణలో ఎస్టీ జనాభా 9.34శాతం ఉండగా, స్థానాల సంఖ్య 14కు పెరగాల్సి ఉంది. మిగతా మొత్తం తెలంగాణలో స్థానాల సంఖ్య 153కు పెరగనుంది. పునర్విభజనను దృష్టిలో పెట్టుకునే గతంలో సీఎం కేసీఆర్‌ జిల్లాల విభజనచేశారు. మరి ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు డీలిమిటేషన్‌ అస్త్రం బయటకు వస్తుందా? కొత్తవారికి అవకాశాలు లభిస్తాయా అన్నది ముందుముందు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement