అసోంలో నైరుతి రుతపవనాల కారణగా కురిసిన వర్షాలకు బ్రహ్మపుత్ర సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన వరదలు ఇంకా తగ్గ్కుముఖం పట్టలేదు. నిలువనీడ లేక, ఆహారం, తాగునీరు లేక లక్షలాదిమంది అలమటిస్తున్నారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారంనాటికి వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 190కి చేరుకుంది. రాష్ట్రంలో కనీసం 11 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది.
దాదాపు 620 గ్రామాలు దెబ్బతిన్నాయి. 9 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. బజలి, కాఛర్, చిరంగ్, దిబ్రూగఢ్, హైలాకండి, కామ్‌రూప్, కరింగంజ్, మోరిగాన్, నౌగాన్, శివసాగర్, తముల్‌పూర్ జిల్లాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. పది జిల్లాల్లో 79 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు లక్షమందికి తాత్కాలిక ఆశ్రయం కల్పించార. బర్‌పేట, బిశ్వనాథ్, బొంగాగావ్, దర్రంగ్, మజులి, మరోిగావ్, నల్బరి, తముల్‌పూర్, తినిసుకియా, ఉదల్‌గురి జిల్లాల్లో ఎక్కువ చోట్ల నేల కోతకు గురైంది. నాలుగు జిల్లాలో దాదాపు 2 లక్షల పశుసంపదపై వరద ప్రభావం పడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.