24వ ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌కు ఏర్పాట్లు బాగా చేశారని ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ సభ్యుడు మహ్మద్ తలేబ్ కితాబిచ్చారు. జూన్ 22 నుంచి 30 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. 8 దేశాల నుంచి 8 క్లబ్‌లు పోటీపడుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య నిర్వహించే ఐహెచ్ఎఫ్ సూపర్ గ్లోబ్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించనుంది.
భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావుతో కలిసి మహ్మద్ తలేబ్ శనివారంనాడు గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తలేబ్ మాట్లాడుతూ… ”ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్ పోటీలకు ఏర్పాట్లు బాగున్నాయి. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టేడియం సిద్ధం చేశారు. ఆసియా క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ చరిత్రలోనే ఈ టోర్నీ ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం కలిగింది” అని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.