ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2024లో పోటీల్లో భారత్ రెండు స్వర్ణాలు దక్కించుకుంది. టెహ్రాన్‌లో వేదికగా ఇవ్వాల (శనివారం) జరిగిన మహిళల 1500 మీటర్ల ఈవెంట్ ఫైనల్‌లో హర్మిలన్ బెయిన్స్ 4:29.55 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించింది.
ఇక, విశాఖపట్నం జిల్లాకు చెంది జ్యోతి యర్రాజీ మహిళల 60 మీటర్ల హర్డిల్స్ పోటీలో విజయం సాధించి భారత్‌కు రెండో స్వర్ణం అందించింది. యర్రాజీ 8.12 సెకన్ల టైమింగ్‌తో పోటీలో గెలుపొంది తన జాతీయ రికార్డును (8:13) బద్దలు కొట్టింది. ఇక జపాన్‌కు చెందిన అసుకా టెరెడా 8.21 సెకన్ల టైమింగ్ రెండవ స్తానంలో నిలవకగా.. హాంకాంగ్‌కు చెందిన లుయి లై యియు 8:26 సెకన్లతో పోడియంపై మూడో స్థానంలో నిలిచింది.