Thursday, November 21, 2024

ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌.. మేం నిర్వహించలేం! : చైనా

బీజింగ్‌ : 2023 ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌పై చైనా కీలక నిర్ణయం వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ దేశం 2023 ఆసియా ఫుట్‌బాల్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చైనీస్‌ ఫుట్‌బాల్‌ అధికారులు వెల్లడించారు. బీజింగ్‌ పెద్దల కఠినమైన జీరో కోవిడ్‌ వ్యూహంతో దేశ క్రీడాశయాలకు మరో దెబ్బ తగిలినట్టయ్యింది. వైరస్‌ అరికట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నామని, అందుకే కఠినమైన లాక్‌డౌన్లు, సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. చైనాలో కరోన తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సిన ఒలింపిక్‌ తరువాత రెండో అతిపెద్ద టోర్నీ ఆసియా క్రీడల నిర్వహణను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల చైనా ప్రకటించింది.

ఆసియా గేమ్స్‌ను 2023కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తాజాగా శనివారం ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎఫ్‌సీ)కు ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌కు అతిథ్యం ఇవ్వబోమని చెప్పింది. వచ్చే ఏడాది జూన్‌, జులైలో 10 నగరాల్లో ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచులు జరగాల్సి ఉన్నాయి. ఈ టోర్నీలో 24 జట్లు పోటీపడుతాయి. అందులో భారత్‌ కూడా ఉంది. కరోనా కారణంగా తాము ఈ టోర్నీ నిర్వహించలేమని చైనా ఫుట్‌బాల్‌ అధికారులు ఏఎఫ్‌సీకి తెలియజేసింది. అయితే ఈ టోర్నీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌, శ్రీలంకలో నిర్వహించలేరు. ఇక ఇండియా లేదా ఇండోనేషియాలో మాత్రమే ఆసియా కప్‌ ఆతిథ్యానికి మొగ్గుచూపే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement