Friday, September 20, 2024

Asian Champions | ఆసియా హాకీ చాంపియన్ గా భార‌త్

పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. ఈరోజు (మంగళవారం) జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జ‌ట్టు 1-0తో చైనాను ఓడించి అజేయ జట్టుగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. 13 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌కు ఇది ఐదో టైటిల్.

కాగా, ఈ మ్యాచ్ లో హాకీ టీమ్ చైనా గట్టి పోటీ ఇచ్చింది. గోల్స్ కోసం ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. భారత అవకాశాలను చైనా సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో వరుసగా మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయలేకపోయాయి. గోల్స్ రాకపోయినా భారత్ తన ఆధిపత్యాన్ని చెలాయించింది. పూర్తిగా బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది.

ఫస్టాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్‌లో చైనాకు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత అద్భుతంగా అడ్డుకుంది. భారత గోల్ పోస్ట్‌పై దాడులు చేసిన చైనా.. ఒత్తిడిని పెంచింది. కానీ ఎలాంటి తప్పిదం చేయకుండా భారత్ తన ఆటను కొనసాగించింది. చివరి క్వార్టర్‌లో మ్యాచ్ మరో 10 నిమిషాలలో ముగుస్తుందనగా.. జుగ్‌రాజ్ సింగ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో ఆధిక్యాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement