Tuesday, November 26, 2024

ఏసియా-ఓసియనియా పారా పవర్‌లిఫ్టింగ్‌.. భారత్‌కు 22 పతకాలు

2022 వరల్డ్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఏసియా-ఓసియనియా ఓపెన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు 22 పతకాలు లభించాయి. భారత పవర్‌లిఫ్టర్లు అశోక్‌, సుధీర్‌లు హంగ్‌జౌ 2022 ఏసియన్‌ పారా గేమ్స్‌కు అర్హత సాధించారు. టోర్నీలో భారత్‌ టీం 6 స్వర్ణ, 4 వెండి, 12 రజత పతకాలు సాధించింది. చైనా 21 గోల్డ్‌ మెడల్స్‌తో సహా మొత్తం 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మెన్స్‌ 65కేజీల విభాగంలో అశోక్‌ రెండు స్వర్ణ పతకాలు చేజిక్కించుకోగా, జోబీ మాథ్యూ అండర్‌ 59 కేజీల విభాగంలో 4 గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. వ్యక్తిగత విభాగంలో సుధీర్‌ 88కేజీల విభాగంలో రెండో రౌండ్‌లో 214 కేజీల బరువు ఎత్తి రజత పతకం చేజిక్కించుకున్నాడు. వరల్డ్‌ చాంపియన్‌ అబ్డేల్‌కరీమ్‌ ఖట్టబ్‌ (జోర్డాన్‌) 241 కేజీలు, చైనా పవర్‌లిఫ్టర్‌ జిజియాంగ్‌ యె 233 కేజీలు ఎత్తి వరుసగా గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించారని భారత పారాలింపిక్‌ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

హంగ్‌జోయు 2022 ఏసియన్‌ పారాలింపిక్‌ గేమ్స్‌కు అశోక్‌, సుధీర్‌తో పాటు 49 కేజీల విభాగంలో పరమ్‌జీత్‌ కౌర్‌, మహిళల అండర్‌ 49 కేజీల విభాగంలో సకిన ఖటు అర్హత సాధించారు. ఈ నలుగురు పవర్‌లిఫ్టర్లు పారిస్‌లో 2024 పారాలింపిక్‌ గేమ్స్‌లో కూడా పాల్గొననున్నారు. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మరింత వృద్ధి చేసుకున్నారు. నేషనల్‌ కోచ్‌ జె.పి. సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ… ”ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో భారత పవర్‌లిఫ్టర్లు ఇదే అత్యంత అత్యుత్తమ ప్రదర్శన. డజన్ల సంఖ్యలో మెడల్స్‌ సాధించడమే కాదు, ఇద్దరు పవర్‌లిఫ్టర్లు హంగ్‌జోయు 2022 ఏసియన్‌ పారా గేమ్స్‌, పారిస్‌ 2024 పారాలింపిక్‌ గేమ్స్‌కు అర్హత సాధించారు. టీం పరంగా అద్భుత ప్రదర్శన కనబరచడం చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌పై దృష్టి సారించాలని పారా పవర్‌లిఫ్టర్లుకు సూచనలిచ్చామన్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కనీసం 2-3 మెడల్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నేషనల్‌ కోచ్‌ జె.పి. సింగ్‌ తెలిపారు. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ తరఫున పరమ్‌జీత్‌, ఖటున్‌, సుధీర్‌, గీత, మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రాతినిథ్యం వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement