మహిళల ఆసియా హాకీ 5 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో భారత మహిళల జట్టు ఇవ్వాల (ఆదివారం) థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. ఇవ్వాల (ఆదివారం) జరిగిన మూడవ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 5-4 తేడాతో గెలిచి అజేయంగా దూసుకుపోతుంది. థాయ్‌లాండ్ డిఫెండర్‌లపై గేమ్ మొదటి నుండి ఒత్తిడి తెచ్చి, భారత్ వేగంగా దూసుకెళ్లింది. అయితే, మొదటి అర్ధభాగంలో ముగిసే సమయానికి స్కోరు బోర్డు సమంగా (3-3) ఉండటంతో సెకండాఫ్‌లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి..
ఇక దీంతో ఫుల్ అటాకింగ్‌గా బరిలోకి దిగిన భారత్ లాస్ట్ మినిట్ గోల్ తో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా, శుక్రవారం ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో భారత్ 7-2 తేడాతో మలేషియాపై గెలుపొందింది. ఇక, నిన్న (శనివారం) రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళలు 7-1తో జపాన్‌పై ఘన విజయం సాధించారు.