Saturday, November 23, 2024

యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నీ..

ఆసియాకప్‌ టోర్నమెంట్‌ వేదిక అందరూ ఊహించినట్లే శ్రీలంక నుంచి యూఏఈకి మారింది. లంకలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో ఆసియా కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించలేమని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రంగంలోకి దిగి, సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపింది. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహణకు మొగ్గుచూపాయి. ఆసియా కప్‌ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా ఈ మేరకు ప్రకటన కూడా చేశారు.

అయితే ఆసియా కప్‌ టోర్నీ ఆతిథ్య హక్కులు మాత్రం శ్రీలంక క్రికెట్‌ బోర్డు సొంతం చేసుకుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీమెంట్‌ జరుగనుంది. ఈసారి ఆసియా కప్‌ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement