Wednesday, November 6, 2024

Asia cup | నేపాల్‌పై భార‌త్ ఈజీ విక్ట‌రీ..

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరుగుతున్న‌ భార‌త్ వ‌ర్సెస్ నేపాల్ మ్యాచ్ లో టీమిండియా ఈజీ విక్టరీని అందుకుంది. బౌలర్లు విఫలమైనా.. భారత బ్యాటర్లు మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘనవిజయం సాధించింది. దీంతో మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంది. వర్షం కారణంగా భారత లక్ష్యాన్ని అంపైర్లు 23 ఓవర్లకు 145 పరుగులుగా నిర్ణయించారు. ఈ క్రమంలో భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి భారత్ గెలిచింది. ఓపెనర్లు శుబ్ మన్ గిల్ 67 (నాటౌట్), రోహిత్ శర్మ 74 (నాటౌట్) మ్యాచ్ ను ముగించేశారు.

231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. దాంతో రెండు గంటల పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ రాత్రి 10.15 గంటలకు (భారత కాలమానంలో) ఆరంభమైంది. అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతి ద్వారా భారత లక్ష్యాన్ని 23 ఓవర్లకు 145 పరుగులకు కుదించారు. భారత ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మలు ఎటువంటి తొందరపాటుకు గురి కాకుండా జట్టుకు అవసరమైన పరుగులను సాధించేశారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా అర్ధ సెంచరీలను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement