ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా ఇవాళ టీమిండియా పాకిస్తాన్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పల్లెకెలెలో ఈరోజు వర్షం కురిసే అవకాశాలు 91 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. టాస్ వేయడానికి ముందే పల్లెకెలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్‌కి, టీమిండియా బ్యాటింగ్‌కీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.
ముఖ్యంగా పాకిస్తాన్‌పై గత రెండేళ్లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు పెట్టుకుంది టీమిండియా. గత రెండేళ్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 4 మ్యాచులు జరగాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో రెండుసార్లు, ఆసియా కప్‌లో రెండు సార్లు ఇండియా- పాకిస్తాన్ తలబడ్డాయి. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.