ఎఫ్‌ఐబీఏ ఆసియాకప్ 2022 గ్రూప్-డీ ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. బుధవారంనాడు జకర్తా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 100-47తేడాతో భారత పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు ఓడిపోయింది. అర్వింద్ కుమార్ ముత్తు కృష్ణన్ 13 పాయింట్లతో భారత జట్లులో అగ్రస్థానంలో నిలవగా, ప్రణవ్ ప్రిన్స్ 10 పాయింట్లతో ఆతర్వాత స్థానంలో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 21 పాయింట్లతో న్యూజిలాండ్ పార్వర్డ్ శామ్ మెన్నెంగ తొలి స్థానంలో నిలిచాడు. భారత జట్టు ఆరంభంలో 6-2తో అద్భుతంగా రాణించింది. వరల్డ్ నం.27 న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. అయితే ఆతర్వాత భారత జట్టు అదే ఊపు కొనసాగించలేకపోయింది.
కెప్టెన్ విశ్వేష్ భ్రిగువంశీ గాయపడి, మైదానం నుంచి వెళ్లిపోవడం కూడా జట్టు సభ్యులను నిరాశపరిచింది. తొలి క్వార్టర్‌లో 30-12తో భారత్ ముగించింది. సెకండ్ రౌండ్‌లో కేవలం 9 పాయింట్ల మాత్రమే సాధించడంతో 64-21 వెనకబడి పోయింది. ఇక థర్డ్ క్వార్టర్‌లో భారత్ ఢిఫెన్సివ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దీంతో న్యూజిలాండ్ 80-35తో ఆధిపత్యం సాధించి, ఫైనల్ క్వార్టర్‌కు చేరింది. ఫోర్త్ క్వార్టర్‌లో భారత్ జట్టు నష్టనివారణకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో న్యూజిలాండ్ 100-47తేడాతో విజయం సాధించింది. ఇక భారత జట్టు శుక్రవారంనాడు వరల్డ్ నం.34 ఫిలిప్పీన్స్‌తో తలపడనుంది. ఆదివారంనాడు 54వ ర్యాంక్ లెబనాన్‌తో భారత్ పోటీపడనుంది. 1975లో జరిగిన ఎఫ్‌ఐబీఏ ఆసియా కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి 5వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.