సింగపూర్ వేదికగా నిర్వహించిన ఏసియా కప్ 2023 ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ టోర్నీలో భారత్‌కు ఆరు సిల్వర్ వెండి, ఒక రజతం మొత్తం ఏడు పతకాలు లభించాయి. మెన్స్ సింగిల్స్ విభాగంలో పార్థ్ సలుంఖే, ఉమెన్స్ విభాగంలో రుమా బిశ్వాస్ సిల్వర్ మెడల్ సాధించారు. ఇక టీమ్ ఈవెంట్స్‌లో భారత్ పురుషుల త్రయం పార్థ్ సలుంఖె- రోహిత్ కుమార్ – జుయెల్ సర్కార్ ప్రత్యర్థి చైనా బృందం చేతిలో 5-1తో ఓటమిని చవిచూసి సిల్వర్ మెడల్ సాధించింది.
ఉమెన్స్ విభాగంలో రిధి- ఆదితి జైశ్వాల్- రుమా బిశ్వాస్ 3-5 తేడాతో కొరియా బృందం చేతిలో పరాజయం పాలైంది. సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. కాంపౌండ్ మెడల్ మ్యాచెస్‌లో ప్రగతి తన ప్రత్యర్థి దీప్షిఖను 147-146తేడాతో ఓడించి రజత పతకం కైవసం చేసుకుంది. కాంపౌండ్ మెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారులు ఉదయ్ కంబోజీ- కుశాల్ దలాల్ – ప్రియాన్ష్ తమ ప్రత్యర్థి కొరియా బృందంపై 238-235 తేడాతో ఓడించి సిల్వర్ మెడల్ చేజిక్కికుంది.
కాంపౌండ్ ఉమెన్స్ ఫైనల్‌లో భారత బృందం ప్రగతి – దీప్షిఖ- సాక్షి చౌదరి తమ ప్రత్యర్థి కొరియా బృందంపై అద్భుతంగా విజయం సాధించింది. ఈ కేటగిరిలో 2076 పాయింట్ల సాధించి భారత బృందం సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇన్‌డివిజల్ కాంపౌండ్ మెన్స్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో ప్రియాన్ష్ ప్రత్యర్థి కొరియా చేతిలో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇక మిక్స్‌డ్ టీమ్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో భారత బృందం రిధి- జుయెల్ సర్కార్ ప్రత్యర్థి ఉజ్బెకిస్తాన్ చేతిలో 1-5తేడాతో పరాజయం పాలై తీవ్ర నిరాశతో వెనుదిరిగింది.