Tuesday, November 19, 2024

ఒడిశా మంత్రిపై ఎఎస్సై కాల్పులు.. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మంత్రి

ఒడిశా ఆరోగ్యశాఖమంత్రి నబా కిషోర్‌ దాస్‌పై ఓ పోలీసు అధికారి కాల్పులకు తెగబడ్డాడు. జార్సుగుడా జిల్లా బ్రజరాజ్‌నగర్‌లోని గాంధీ చౌక్‌ వద్ద మధ్యహ్నానం ఒంటిగంటకు మంత్రిపై అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మంత్రి ఛాతీ భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్స పొందుతూ సాయంత్రం ఆయన ప్రాణాలు విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తొలుత ఆస్పత్రికి తీసుకురాగానే సీనియర్‌ డాక్టర్‌ దేబాశిస్‌ నాయక్‌ నేత్‌ృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్‌ గుండె, ఎడమ వైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. మంత్రి తన వాహనం నుంచి దిగుతుండగా పోలీసు అధికారి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

స్థానిక గాంధీచౌక్‌లో ప్రజా ఫిర్యాదుల కార్యాలయం ప్రారంభోత్సవం చేసేందుకు మంత్రి మధ్యహ్నానం ఇక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున గాంధీచౌక్‌కు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పట్టుకున్నామని, అతడిని గోపాల చంద్రదాస్‌గా గుర్తించినట్లు బ్రజరాజ్‌నగర్‌ ఎస్‌డీపీఓ గుప్తేశ్వర్‌ భోయ్‌ తెలిపారు. మంత్రిపై దాడి జరిగిందన్న సమాచారం అందుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయిక్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. మంత్రిపై దాడికి పాల్పడిన ఎఎస్సై మానసిక పరిస్థితి సరిగాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కిశోర్‌ దాస్‌ మరణం ఒడిశాకు తీరని నష్టం.. సీఎం సంతాపం

- Advertisement -

ఆరోగ్యమంత్రి నబ కిశోర్‌ దాస్‌ మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయిక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మరణం తనను తీవ్ర షాక్‌కు, ఆవేదనక గురిచేసిందన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తి అని సీఎం అన్నారు. ఆయన ప్రజల మనిషి అని, ప్రజలకు లబ్ది చేకూరేలా కృషి చేశారని కొనియాడారు. పార్టీని బలోపేతం చేయడంలో కిశోర్‌ దాస్‌ కీలకంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇటీవల నబకిశోర్‌ దాస్‌ మహారాష్ట్రలోని శని శింగణాపుర్ర దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement