భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లీగులో 20 సార్లు బ్యాటర్లను డకౌట్ చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐపీఎల్‌లో ఇలాంటి ఘనత ఇప్పటి వరకు ఇంకెవ్వరికీ లేదు. ఈ రికార్డును బ్రేక్ చేయడమూ అంత సలుభం కాదంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. ఐపీఎల్ 2023లో నిన్న (గురువారం) రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఘోరంగా దెబ్బకొట్టారు. కీలకమైన వికెట్లు పడగొట్టారు. కీలక 4 ఓవర్లలో అశ్విన్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
అంతే కాకుండా ఐపీఎల్ 2023లో రవిచంద్రన్ అశ్విన్ దూకుడు మీదున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 8 మ్యాచుల్లో 7.28 ఎకానమీ, 21.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. 17.25 బంతులకు ఒక వికెట్ చొప్పున తీశాడు. 32 ఓవర్లు విసిరి 233 పరుగులు ఇచ్చాడు. అతడిలాగే రెచ్చిపోతే పర్పుల్ క్యాప్ అందుకోవడం కష్టమేమీ కాదు