టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంకను ఔట్ చేయడం ద్వారా.. ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 435 వికెట్లు పడగొట్టాడు. దీంతో కపిల్ దేవ్ (434 వికెట్లు) రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. ఇక తొలి స్థానంలో కుంబ్లే (619 వికెట్లు) ఉండగా.. నాల్గో స్థానంలో భజ్జీ (417) ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ది 9వ స్థానం. తొలి స్థానంలో 800 వికెట్లతో శ్రీలంకన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), అండర్సన్ (640), కుంబ్లే (619), మెక్‌గ్రాత్ (563), స్టువర్ట్ బ్రాడ్ (537), కౌట్నీ వాల్ష్ (519), డేల్ స్టెయిన్ (439), తాజాగా అశ్విన్ (435) ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..