కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఆదివారం కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయన్ను తిరిగి లఖింపూర్ జైలుకు తరలించారు. లఖింపూర్‌ఖేరి హింసాత్మక ఘటనలో ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను సుప్రీం కోర్టు గతవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో లఖింపూర్‌ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు రైతులతో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేయగా.. ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..