విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మకు ఆషాఢ మాస తొలి సారెను దేవస్థానం తరపున వైదిక కమిటీ, దేవస్థానం ఉద్యోగులు ఆదివారం సమర్పిస్తారని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఉదయం 7 గంటలకు స్థానాచార్య శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో అర్చక సిబ్బంది. అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారని తెలిపారు.
ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢ సారెను సమర్పించే భక్తులు, ధార్మిక సంస్థలు మూడు రోజులు మందుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలని కోరారు. ఆఫీసు వేళల్లో దేవస్థానం ఫోను నెంబర్లు 9493545253, 8341547300లకు ఫోను చేసి ఎక్కడి నుంచి సారెను తీసుకువస్తున్నది. భక్తుల సంఖ్య , ఏ తేదీ సమర్పించేది తదితర వివరాలను ముందుగా నముదు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించి దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ వార్త కూడా చదవండి: భాగ్యనగరంలో బోనాల సందడి