Saturday, November 23, 2024

అసానీ ఎఫెక్ట్​.! తుఫాన్‌గా మారనున్నఅసానీ.. వెల్లడించిన ఐఎండీ

ప్రభన్యూస్‌,హైదరాబాద్‌: మహానగరంలో ఠా.రెత్తిస్తున్న భానుడి ప్రతాపం తగ్గుముఖం పట్టింది. ఉదయం, మధ్యాహ్నా వేళల్లో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నప్పటికీ.. సాయంత్రం మాత్రం ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించి..మబ్బులతో కమ్మేస్తోంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో..నగర వాసులు ఎండల నుంచి ఉపశమనం పొందుతుండటం గమనార్హం. దీనికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనమే కారణమని తెలుస్తోంది. అప్పపీడనం అండమాన్‌ సముద్రానికి దక్షిణాన కొనసాగుతోంది. అండమాన్‌ అండ్‌ నిరోబార్‌ దీవుల వెంట ఉత్తర దిక్కులో కదులుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది.

ఈ రోజు (21) న తుఫానుగా మారనుంది. దీన్ని అసానీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ.. ఈ నెల 22 బంగ్లాదేశ్‌ ఉత్తర, మయన్మార్‌ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతోనే ఆకాశం మేఘావృతమై..వాతావరణం చల్లబడుతుందని అధికారులు చెబుతున్నారు.న అయితే రాగల మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందనీ, ఈ రోజు (21) నుంచి 23 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement