Saturday, September 28, 2024

ప్చ్‌.. భేటీయే జరగలే, దిగివచ్చిన బీజేపీ అసంతృప్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పార్టీ అధిష్టానం కఠినంగా ఉండటంతో బీజేపీ అసంతృప్త నేతలు వెనక్కు తగ్గారు. కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకత్వ పనితీరును తప్పుబడుతూ జిల్లాల వారిగా సమావేశాలను నిర్వహించి రెండు రోజుల క్రితం ఏకంగా హైదారాబాద్‌లో భేటీ అయిన అసంతృప్తులు ఢిల్లిdకి వెళ్ళి తేల్చుకోవాలని నిర్ణయించారు. అయితే అసంతృప్తులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానం రాష్ట్ర పార్టీని ఆదేశించడంతో చర్యలకు ఉపక్రమించారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలకు సన్నద్దమయ్యారు. తమ పట్ల అధిష్టానం సీరియస్‌గా ఉందన్న విషయాన్ని గ్రహించిన అసంతృప్త నేతలు ఒక్కొక్కరు వెనక్కు తగ్గుతున్నారు. పార్టీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, ఏ మాత్రం అసంతృప్త నేతలు బుధవారమే సమావేశానికి వెళ్ళలేదంటూ బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాకుండా తామెప్పుడూ పార్టీ విధేయులమని తేల్చి చెప్పారు. తాజాగా సమావేశం నిర్వహించేందుకు ప్రధాన సంధానకర్త అయిన కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అసలు సమావేశమే జరగలేదని, అలాంటప్పుడు అసంతృప్త నేతలని, తిరుగుబాటు అని ఎలా అంటారని ఎదురు ప్రశ్నించారు. పార్టీ నుంచి ఎవరికీ ఇంత వరకు ఫోకాజ్‌లు అందలేదన్నారు. షోకాజ్‌లు అందిన తర్వాత సమాధానాలు ఇస్తామన్నారు.

అంతర్గత శత్రువులపై ఉపేక్ష వద్దు..

అధికార టీఆర్‌ఎస్‌పై యుద్ధం ప్రకటించిన బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోంది. ఈ పోరాట ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని నేతలు, అధిష్టానం భావిస్తున్న తరుణంలో కొంత మంది పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి అంటూ ప్రత్యేక భేటీలను నిర్వహించడంతో అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుత పరిస్థితులలో శత్రువుతోనే పోరాడాలి కానీ, అంతర్గత శత్రువులను ప్రోత్సహించరాదని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. బుధవారం సంజయ్‌తో పాటు పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లిdకి వెళ్ళడం, అక్కడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్‌తో పాటు పలువురిని కలిశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పుడు ప్రచారంతో పాటు పార్టీకి చెందిన కొంత మంది నేతలు రాష్ట్ర నాయకత్వంపై చేస్తున్న పరోక్ష ఆరోపణలపై కూడా చర్చ జరిగిందని తెలిసింది. ఈ చర్చలో ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వాటిపై ఏ మాత్రం ఉపేక్షించరాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారెవరైనా కఠినంగా ఉండాల్సిందేనని సంకేతాలిచ్చారు.

పార్టీ నేతలతో ఏ ఇబ్బందులు ఉన్నా తమను నేరుగా సంప్రదించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయినప్పటికీ కావాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా వ్యవహరించడం సరైంది కాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోయేందుకు అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందని, కేంద్ర నేతలెవరికీ తమకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేసేలా సమావేశం నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న వారందరికీ నోటీసులు ఇవ్వాలని, వారి నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్‌ నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా తేల్చి చెప్పడంతో రాష్ట్ర నాయకులు షోకాజ్‌లను జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement