జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధృవీకరించారు. త్వరలోనే ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని గంగూలీ స్పష్టం చేశారు.
రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా గంగూలీ అంగీకరింపజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ ఆకాంక్షించారు. బీసీసీఐ చీఫ్ మాత్రమే కాదు, సెక్రటరీ జై షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరారు.