Monday, November 25, 2024

క్రికెట్​ వరల్డ్​ కప్​ తొలి మ్యాచ్​ అహ్మదాబాద్​లోనే.. పెరిగిన హోటల్ ధరలు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధికారులు మెన్స్ ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను మంగళవారం (జూన్ 27) ప్రకటించారు. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అంతే కాకుండా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌తో సహా ఈ సంవత్సరం ODI ప్రపంచ కప్ లోని అన్ని హై-ప్రొఫైల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్ జ‌రుగుతున్నాయి.

కాగా, టోర్నమెంట్‌లో మొదటిఅక్టోబరు 5న మ్యాచ్ జరగనుండగా, ఇంకా రెండు నెలలు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అహ్మదాబాద్‌లో హోటల్ గదుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. నివేదిక ప్రకారం, మూడున్నర నెలల ముందుగానే బుక్ చేసుకున్నప్పటికీ, బేస్ కేటగిరీ గది ధర దాదాపు రూ.6,500-10,500 ఖర్చవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఒక‌ రాత్రికి రూ.50,000గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అక్టోబర్ 15న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. ఆ రోజుకి అహ్మదాబాద్‌లోని హోటల్ రూమ్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక 2012 తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత గడ్డపై అడుగు పెట్టడం ఇదే తొలిసారి. దీంతో భారత్ – పాకిస్థాన్ మ‌ద్య జ‌రిగే మ్యాచ్ ఫేస్ ఆఫ్‌లు చిరస్మరణీయంగా మిగిలిపోవాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement