Friday, November 22, 2024

బిహార్​లో ఉద్రిక్తత, అగ్నిపథ్​పై భగ్గమంటున్న ఆర్మీ అభ్యర్థులు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై హింసాత్మక నిరసనలు 2వ రోజు కొనసాగుతున్నాయి. బిహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నిన్న (గురువారం) నవాడలో బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు ఇప్పుడు మాధేపురాలోని రెండో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.  కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై బీహార్​ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్​, ఢిల్లీ, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పలు చోట్ల రైళ్లను తగలబెట్టాయి. అయినా కేంద్ర ప్రభుత్వ దిగిరావడం లేదని ఆందోళనకారులు మండిపడుతున్నారు.   

కేంద్రం కూడా 2022లో అగ్నిపథ్ పథకానికి ప్రవేశ వయస్సును 21 నుండి 23 సంవత్సరాలకు పెంచింది. 4 సంవత్సరాల తర్వాత 25శాతం మంది అగ్నివీర్​లను మాత్రమే ఆర్మీలో ఉంచుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో అభ్యర్థుల్లో ఆందోళన తలెత్తింది. అయితే.. పలువురు విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.  

ఇక.. బీహార్‌లో విద్యార్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేసి రైళ్లకు నిప్పు పెట్టారు. దీని తర్వాత అరా రైల్వే స్టేషన్‌లో విధ్వంసం, దోపిడీ, దహనం చేసినందుకు 16 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.650 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

అయితే.. రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించడానికి విద్యార్థులు శుక్రవారం బీహార్‌లోని బిహియా రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు బిహియా రైల్వే స్టేషన్ ఇన్‌చార్జిని కూడా గాయపరిచారు. ఒక మీడియా వ్యక్తిపై దాడి చేశారు. అతని ఫోన్ పగలగొట్టారు. కుల్హారియా రైల్వే స్టేషన్‌పై కూడా నిరసనకారులు దూసుకుపోయారు. సమస్తిపూర్ స్టేషన్‌లో  ఒక రైలును తగులబెట్టారు. రాళ్లు రువ్వారు. అలాగే బెగుసరాయ్ రైల్వే స్టేషన్‌లో కూడా నిరసనలు చెలరేగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement