Thursday, November 21, 2024

Delhi | కేజ్రివాల్ లేఖ.. నిబంధనల ఉల్లంఘనే !

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మొదట ఈడీ అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. ఈడీ కేసులో బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో ఊరట లభించకపోవడంతో జైలులోనే ఉన్నారు.

కాగా, జైలు నిబంధనల ఉల్లంఘనలకు అరవింద్ కేజ్రీవాల్ పాల్పడ్డారని జైలు అధికారులు పేర్కొంటున్నారు. జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు తాజాగా ఒక లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం.. కస్టడీలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటిని మాత్రమే లేఖలో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖలో ఆగస్ట్ 15 వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో తన తరఫున ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషీ మార్లేనా జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు.

ఇది పూర్తిగా జైలు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని.. అందుకే ఈ లేఖ బయటకు వెళ్లలేదని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. జైలు నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే.. కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement