Friday, November 22, 2024

Counting | అరుణాచల్‌ప్రదేశ్‌.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ

అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న కౌంటింగ్‌ జరగాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు నేటితో ముగియనున్నది. దీంతో ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అరుణాచల్‌లో 60 స్థానాలుండగా, సిక్కింలో 32 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ జరిగింది.

- Advertisement -

ఇక‌.. అరుణాచల్‌లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. మరో 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అరుణాచల్‌లో సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 31 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 8 స్థానాల్లో, కాంగ్రెస్‌ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement